కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం రాజీవ్ రహదారిని ఆనుకొని ఉన్న గుండ్లపల్లి ఎక్స్ రోడ్డుపై నిరుపయోగంగా పడి ఉన్న బస్టాండ్ ఎలాంటి ఆదరణకు నోచుకోకుండా ఉంది, గతంలో స్థానిక గ్రామ పంచాయతీ పాలకవర్గం మరియు నాయకులు ప్రజల సౌకర్యార్థం బస్టాండును బాగు చేయాలని అటు ఆర్టీసీ ఇటు టోల్ ప్లాజా యాజమాన్యాన్ని కోరినా ,నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు ,ఈ విషయం ఈ నోటా ఆ నోటా ప్రభుత్వం దృష్టిలో పడింది ,అది అదునుగా కలెక్టర్ ఆదేశాల మేరకు రోడ్ సేఫ్టీ కమిటీని నియమించింది ,ఈ రోడ్ సేఫ్టీ కమిటీ ఎక్స్ రోడ్డు పరిస్థితిని గమనించి ,ప్రమాదాల నియంత్రణకు మరియు బస్టాండ్ నిర్వహణ గురించి టోల్ ప్లాజా యాజమాన్యానికి కొన్ని సూచనలిచ్చింది ,దాన్ని కూడా పెడచెవిన పెట్టింది టోల్ యాజమాన్యం, కాగా బస్టాండును మూత్రశాల గా వాడుతున్నారు కొందరు ప్రయాణికులు, ఎందుకంటే అక్కడ మూత్రశాలలు లెవు కనుక, మరి మహిళల పరిస్థితులేంటి అనుకుంటున్నారు కొందరు మహిళలు ,అదే విధంగా మరికొందరు బస్టాండ్ను ఫుడ్ కోర్టులు గా మార్చి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు,బస్టాండులో బస్సులు నిలవకపోవడంతో పలుచోట్ల ప్రయాణీకులు వేచి ఉండాల్సిన సందర్భం ఎంతగానో కనిపిస్తుంది దీన్ని ఆసరాగా చేసుకుని ఆటోలు విచ్చలవిడిగా నిలిపివేయడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి ఇది ప్రజలకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది అని కొందరు స్థానికులు అంటున్నారు ,ఇప్పటికైనా ప్రయాణికులకు సౌకర్యం కల్పించేలా అధికారులు స్పందించాలని కోరుతున్నారు .