అమెరికా దారుణం చోటు చేసుకుంది . నిర్లక్షణానికి ఒక నిండు ప్రాణం బలైంది హైదరాబాద్ కు చెందిన 25 ఏళ్ల యువతి చరితా రెడ్డి ఎల్ల అమెరికాలోని మిచిగాన్ లో సాఫ్ట్ వేర్ఇం జనీర్ గా లో పనిచేస్తుంది. డెలాయిట్ సాఫ్ట్ వేర్ సంస్థలో చరితారెడ్డి ఉద్యోగం చేస్తూ లాన్సింగ్ లో నివాసముండేవారు. 4ఏళ్ల క్రితమే ఆమె తన ఎం.ఎస్ చేసేందుకు అమెరికాకు వెళ్లారు. అయితే, మొన్న రాత్రి 8:50టైంలో ఒట్టావా పరిధిలోని క్రొకెరీ టౌన్ షిప్ వద్ద ఆమె ప్రయాణిస్తున్న కార్ కు ఆక్సిడెంట్ జరిగింది. ఫుల్ గా మద్యం తాగిన ఓ వ్యక్తి చరితా రెడ్డి ప్రయాణిస్తున్న టయోటా కార్ ని వెనుక నుంచి మరొక కారుతో వేగంగా ఢీకొట్టాడు. ఆ సమయంలో చరితారెడ్డి తన కారు వెనుక సీట్ లో కూర్చోవడం వలన ఆమెకు బాగా గాయాలయ్యాయి. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఆమె కోమాలోకి వెళ్లిపోయారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )