నెల్లూరు జిల్లా :విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ఈ నెల 30వ తేది నుంచి నిర్వహించాల్సిన డిగ్రీ అడ్వాన్సు సప్లీమెంటరీ పరీక్షలను నివార్ తుఫాను కారణంగా వాయిదా వేయడం జరిగిందని , జిల్లా లో నివార్ తుఫాను వల్ల రోడ్లు మరియు రవాణా వ్యవస్థ దెబ్బ తిన్న కారణంగా విద్యార్థుల సౌకర్యార్థం పరీక్షలను వాయిదా వేయడం జరిగిందని , తిరిగి మరలా పరీక్షలను ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియ జేస్తామని విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు. సవరించిన కొత్త పరీక్షల టైం టేబుల్ కొరకు విశ్వవిద్యాలయ వెబ్సైటు ను సందర్శించి తెలుసుకోవచ్చునని మరియు సంబంధిత ప్రిన్సిపాల్ ద్వారా పరీక్షల సమాచారాన్ని తెలుసుకోవచ్చునని విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి తెలియజేసారు.