న్యూఢిల్లీ: ఉత్తర ఢిల్లీలోని నారాయణ ప్రాంతంలో ఈరోజు ఉదయం పిల్లలతో వెళుతున్న స్కూలు బస్సును డీటీసీకి చెందిన క్లస్టర్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. వీరిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో స్కూలు బస్సు బోల్తా పడింది. ఉదయం 7 గంటల సమయంలో విద్యార్థులను ఎక్కించుకుని బస్సు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference