కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో అకాలంగా కురిసిన వర్షానికి వరి పత్తి పంటలు నేలకొరిగాయి గురువారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ జిల్లా మరియు మండల నాయకులు చిట్కారి అనంతరెడ్డి, జాగిరి శ్రీనివాస్ గౌడ్ కుసుంభ తిరుపతి రాపోలు అనిల్ అంజిరెడ్డి తదితర నాయకులు మండలంలోని పలు గ్రామాల్లో రైతుల యొక్క నేలకొరిగిన వరి పత్తి పంటలను పరిశీలించారు ప్రభుత్వం రైతులు నష్టపోయిన వరి పత్తి పంటలను పరిశీలించి రైతులకు నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు