ఉర్కొండ మండలంలోని రేవల్లి మరియు ఊర్కొండపేట గ్రామ పంచాయతీల్లో మూడో రోజు రెండో విడత కొనసాగుతున్న పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఇ.శ్రీధర్ ఆకస్మికంగా రేవెల్లి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న డంపింగ్ యార్డ్ వైకుంఠధామం పనులను పరిశీలించారు డంపింగ్ యార్డ్ వైకుంఠధామం పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటుచేసిన గ్రామంలో అభివృద్ధి పరచాల్సిన మరియు అభివృద్ధి పరిచిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు. గ్రామంలో నిర్వహించిన పరిశుభ్రత పనులపై సంతృప్తి పరిచారు. అనంతరం కార్యాలయంలో నిర్వహిస్తున్న అన్ని రిజిస్టర్ లను పరిశీలించి, రిజిస్టర్ల నిర్వహణపై ముఖ్యమైన సూచనలు సలహాలు అందించారు.
గ్రామంలో ఉన్న 18 ఏళ్ల పై పడిన నిరక్షరాస్యులను గుర్తించి ఈ పంచాయతీలో ఆన్లైన్లో పొందుపరచాలన్నారు. ఇప్పటివరకు సేకరించిన పేర్లను ఈరోజు సాయంత్రం వరకు ఆన్లైన్లో పొందుపరచాలని కార్యదర్శిని ఆదేశించారు. గ్రామంలో పరిశుద్ధ మొక్కల పెంపకానికి నీటిని అందించేందుకు, ట్రాక్టర్ కొనుగోలు చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సర్పంచ్ సునీతను ఆదేశించారు. హరితహారంలో భాగంగా గ్రామంలో నాటిన 1000 మొక్కలను సంరక్షించినందుకు, హరితహారం కమిటీలో ఉత్సాహంగా పని చేసిన వార్డు మెంబర్ బాలరాజును అభినందించారు. గ్రామపంచాయతీలో 9 లక్షల నిధులు ఉన్నట్లు కలెక్టర్ గుర్తించారు. గ్రామ పంచాయతీకి సంబంధించిన కరెంట్ బిల్లులను వెంటనే చెల్లించాలని ఆదేశించారు. గ్రామంలో 280 కుటుంబ సముదాయాలు ఉన్నాయి, 1171 మంది జనాభా ఉన్నారని, గ్రామ పంచాయతీ టాక్స్ ల వసూలు చేయాలని,ఇప్పటి వరకు 37వేలు వసూళ్లు సాధించారని 100% టాక్స్ లు సాధించాలన్నారు.
గ్రామంలో ఏర్పాటు చేయనున్న నర్సరీని పరిశీలించారు గ్రామానికి అవసరమైన ప్రజలు కోరిన మొక్కలని అందించాలన్నారు. జూన్ లో నిర్వహించనున్న హరితహారం కార్యక్రమం నాటికి ప్రతి ఇంటికి ఆరు మొక్కలను అందించాలని అందులో తప్పనిసరిగా పండ్లు పూల మొక్కలతో పాటు ప్రజలకు అవసరమైన మొక్కలను మాత్రమే నర్సరీలో మొక్కల పెంపకాన్ని నిర్వహించాలన్నారు.
గ్రామాన్ని ఇదేవిధంగా అభివృద్ధి పరచాలని గ్రామ సర్పంచ్ ను వార్డ్ మెంబర్ లను అధికారులను సూచించారు.
ఊరుకొండ పేట గ్రామంలో నర్సరీ సందర్శించి మొక్కలను పరిశీలించారు.వైకుంఠ ధామం, డంపింగ్ యార్డ్, పనులను పరిశీలించి వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో రిజిస్టర్ లను పరిశీలించారు. 30 ఏళ్ల క్రితం నిలిపివేసిన సంతను 30 రోజుల ప్రణాళిక లో భాగంగా మళ్లీ గ్రామ సంతను ప్రారంభించామని సర్పంచ్ అనిత కలెక్టర్ దృష్టికి తీసుకురాగా అందుకే ఆమెను అభినందించారు.
గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు గ్రామ అభివృద్ధి పనుల చేయక ముందు, చేసిన తర్వాత, ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్ తిలకించి అభివృద్ధిపరిచిన పనులపై అభినందించారు.గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ కొనుగోలు తర్వాత గ్రామపంచాయతీ పనులతోపాటు గ్రామ పంచాయతీకి ఆదాయ వనరులను సమకూర్చుకునే విధంగాగా ట్రాక్టర్లను వినియోగించుకోవాలన్నారు.ఉర్కొండపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి పాఠశాలలో నిర్వహించిన పరిశుభ్రత కార్యక్రమాన్ని పరిశీలించారు.గ్రామ యువకులు ఏర్పాటుచేసిన క్రీడా మైదానాన్ని పరిశీలించారు.పాఠశాలలో విద్యార్థుల ఉపాధ్యాయుల వివరాలను ప్రధానోపాధ్యాయ తో అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న పల్లె ప్రగతి పురోగతిపై వివరించారు.
పల్లె ప్రగతి లో గ్రామ ప్రజలు పాల్గొని తమ గ్రామాన్ని తామే బాగుచేసుకునే బృహత్తరమైన కార్యక్రమమని, గ్రామానికి సేవ చేసి తమ గ్రామ అభివృద్ధికి ప్రజలే మార్గదర్శికులు కావాలన్నారు.జిల్లా వ్యాప్తంగా పల్లె ప్రగతి విజయవంతంగా కొనసాగుతుందని పల్లెల్లో పరిశుభ్రత కార్యక్రమాలు జోరందుకున్నాయి, అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్ మండల ప్రత్యేక అధికారి చంద్రశేఖర రావు, ఆర్డిఓ రాజేష్ కుమార్, ఎంపీడీవో ప్రభాకర్, ఎంపీపీ రాధా, జడ్పిటిసి శాంతకుమారి, గ్రామ సర్పంచులు సునీత, అనిత గ్రామాల వార్డు మెంబర్లు గ్రామ ప్రజలు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.