ఉమ్మడి కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు దోనె అశోక్ ఆధ్వర్యంలో పశ్చిమ బెంగాల్ లో బిజెపి కార్యకర్తలపై జరిగిన దాడిని కండిస్తు నల్ల బ్యాడ్జీలు ధరించి అంబేద్కర్ కూడలి వద్ద నిరసన తెలపడం జరిగింది.
అనంతరం మండల అధ్యక్షులు అశోక్ మాట్లాడుతూ పశ్చిమబెంగాల్లో బీజేపీ కార్యకర్తల పై TMC గుండాలు చేస్తున్న హత్యలను అరికట్టాలని అలాగే టీఎంసీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని బిజెపి కార్యకర్తలపై దాడులు చేసిన TMC కార్యకర్తలను వెంటనే శిక్షించాలని లేనియెడల భారత జనతా పార్టీ తరపున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు బండి పల్లి సత్యనారాయణ , కొత్తపేట రామచంద్రం, టౌన్ ప్రెసిడెంట్ రవి , మహిళా అధ్యక్షురాలు బామండ్లా జ్యోతి, యువ మోర్చా నాయకులు నిశాంత్ గౌడ్, గంప రవి కుమార్ గుప్తా, వడ్లూరు శ్రీనివాస్, వనపర్తి శివ సాయి తదితరులు పాల్గొన్నారు.