దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఒకే చమురు విధానం లేదని కేంద్ర ప్రభుత్వం గురువారం పార్లమెంట్ కు నివేదించింది. ఆయా రాష్ట్రాలు విధించే పన్నుల ఆధారంగా ధరల్లో మార్పులు ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి లోక్ సభకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అలాగే పెట్రోల్ ధర దేశంలోనే ఏపీలో అత్యధికంగా ఉన్నట్లు తెలిపారు.
ఇంధన ధరల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. పెట్రోల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ కు నివేదికను ఇచ్చింది. ఏపీలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.87, లీటర్ డీజిల్ ధర రూ.99.61గా ఉన్నట్లు తెలిపింది. పెట్రోల్ ధరల్లో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో ఉండగా, డీజిల్ ధరల్లో లక్షద్వీప్ తొలి స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ డీజిల్ ధరల్లో రెండో స్థానంలో ఉంది. కాగా, అమరావతినే రాజధానిగా పరిగణించి కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలను సేకరించింది. అమరావతిని కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు సేకరించినట్లు కేంద్రం తెలిపింది. ఇక తెలంగాణలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66గా, డీజిల్ రూ.97.82గా ఉంది.