పెదకాకాని సి ఐ శోభన్ బాబు గారు ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేసి సామాన్య ప్రజల సమస్యల పరిష్కారానికి ,లాక్డౌన్ అమలులో కరోనా బారి నుండి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు కృషి చేశారని,మండల పరిధిలో సిఐ గా భాధ్యతలు చేపట్టిన తర్వాత అసాంఘిక శక్తులను మరియు అక్రమ వ్యాపారాలపై ఉక్కుపాదం మోపి ప్రజలు ప్రశాంతంగా ఉండేలా పెదకాకాని మండలంలో శాంతి భధ్రతలకు విఘాతం కలుగకుండా పటిష్ట చర్యలు చేపట్టిన డైనమిక్ ఆఫీసర్ అని. పేద ప్రజలకు సామాన్యులకు నిష్పక్షపాతంగా నిజాయితీగా ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తున్న సిఐ శోభన్ బాబు గారి సేవలు అభినందనీయమని భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిరోహించాలని మాలమహానాడు రాష్ట్ర కన్వీనర్ కొర్రపాటి సురేష్ ,పాస్టర్ల ఫెలోషిప్ మండల అధ్యక్షులు సంకూరు కోటేశ్వరరావు మరియు ఎస్సీ ఎస్టీ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం నాయకులు మండే విజయ్ కుమార్ తదితరులు బుధవారం పెదకాకాని పోలీస్ స్టేషన్ లో శోభన్ బాబు గారిని గౌరవంగా కలిసి శాలువా పుష్పగుచ్ఛంతో అభినందించి సత్కరించారు.