కరీంనగర్ జిల్లా: శుక్రవారం పదవీ విరమణ చేసిన పోలీస్ అధికారులను కరీంనగర్ అడిషనల్ పోలీస్ కమిషనర్ (పరిపాలన) జి చంద్ర మోహన్ శాలువాలతో సన్మానించి జ్ఞాపికలను అందజేశారు ఈ సందర్భంగా పోలీస్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ ద్వారా జమ అయిన మొత్తాన్ని చెక్కుల రూపంలో అందించారు పదవి విరమణ చేసిన వారిలో ఏఎన్ఐ లు ఆర్ వీరస్వామి కొత్తపల్లి, ఎన్ వెంకటేశ్వర్లు, (టూ టౌన్ కరీంనగర్) ఏఆర్ ఎస్ఐ ఎండి అబ్దుల్ జబ్బర్, (సి ఏ ఆర్ కరీంనగర్) హెడ్ కానిస్టేబుల్ పి సుధాకర్ ఉన్నారు ఈ సందర్భంగా పోలీస్ అడిషనల్ కమిషనర్ జి చంద్రమోహన్ మాట్లాడుతూ ఆరోగ్యాన్ని నియంత్రణలో ఉంచుకునేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు పదవి విరమణ సందర్భంగా లభించే రూపాయలను శాశ్వత అవసరాల కోసం మాత్రమే వినియోగించుకోవాలని అత్యాశకు పోయి ఇతర వ్యవహారాల్లో పెట్టుబడులు పెడితే తిరిగి లభించే అవకాశాలు ఉండవనే విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారుల అసోసియేషన్ అధ్యక్షులు ఎం సురేందర్, సభ్యులు రామస్వామి, పండరి మధు, తదితరులు పాల్గొన్నారు