కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల లో భాగంగా ఎస్సై ఆవుల తిరుపతి ఆధ్వర్యంలో శుక్రవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జెడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి హాజరయ్యారు జడ్పిటిసి మడుగుల రవీందర్ రెడ్డి, ఎస్సై ఆవుల తిరుపతి తో కలిసి రక్తదానం చేశారు ప్రజా ప్రతినిధులు యువకులతో కలిసి ఎస్సై మరియు జడ్పిటిసి కి శాలువాలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు తీగల మోహన్ రెడ్డి , టిఆర్ఎస్ పార్టీ నాయకులు న్యాత సుధాకర్, గంప వెంకన్న,లింగాల మహేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ బూర వెంకటేశ్వర్, వివేకానంద యూత్ అధ్యక్షుడు గూడూరి సురేష్ ,టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు జాలి తిరుపతిరెడ్డి, వివిధ పార్టీ నాయకులు హరి కాంతం అనిల్ రెడ్డి, జీల కుమార్ యాదవ్, మర్రి వెంకట మల్లు, కరీంనగర్ ప్రతిమ ఆసుపత్రి సిబ్బంది యువజన సభ్యులు, వివిధ పార్టీ నాయకులు, యువజన సభ్యులు తదితరులు పాల్గొన్నారు