శ్రీకాకుళం జిల్లా షేర్ మహమ్మదాపురం మాజీ సర్పంచ్ అవినాశ్ చౌదరి ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ పై నుంచి కిందకు దూకారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో, ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇరు వర్గాల మధ్య వివాదం నేపథ్యంలో ఆయన మనస్తాపానికి గురయ్యారు. షేర్ మహమ్మదాపురంలోని శివాలయం విషయంలో ఇరు వర్గాల మధ్య ఈ వివాదం తలెత్తింది. ఈ వివాదం కాస్తా పోలీస్ స్టేషన్ వరకు చేరింది. ఈ క్రమంలో ఆయన పోలీస్ స్టేషన్ పైకి ఎక్కారు. ఆయనను అడ్డుకోవడానికి ఒక వ్యక్తి రాగా… వెంటనే ఆయన పై నుంచి దూకేశారు.