కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జాల శక్తి అభియాన్ కార్యక్రమం లో కరీంనగర్ జిల్లా (డి వై ఓ) డిస్టిక్ యూత్ ఆఫీసర్ రాంబాబు మరియు గన్నెరువరం మండల డిప్యూటీ తాసిల్దార్ మహేష్ ముఖ్య అతిథులుగా పాల్గొని గ్రౌండ్ వాటర్ లేని గ్రామాలు మరియు మండలల లిస్టులో గన్నేరువరం మండలం జిల్లాలో మొదటి స్థానంలో ఉందని పక్కన డ్యాము ఉన్నా గ్రౌండ్ లెవెల్ వాటర్ లేవు అని గ్రౌండ్ వాటర్ ని పెంచే విధంగా ప్రతి ఒక్కరూ నీటిని సంరక్షించడం. ప్రతి వర్షపు బొట్టును ఒడిసి పట్టండి అని వర్షపు నీరు ను మనము భూమిలోకి ఇంకే విధంగా మనమందరం ప్రయత్నం చేయాలని ఇంకుడు గుంతల తో పాటు ఇంకా వాటర్ ని ఏవిధంగా హార్వెస్టింగ్ చేయాలి కొత్త విధానాలను తీసుకురావాలని మండలంలోని గ్రామ పంచాయతీ సెక్రెటరీ లకు విలేజ్ యుత్ వాలంటరీ లకు. మహిళా గ్రూప్ సభ్యులకు . గ్రామ సర్పంచు లకు .జల శక్తి అభియాన్ కార్యక్రమం ద్వారా వారికి వాటిపై అవగాహన కల్పించడం జరిగింది. అనంతరం జల శక్తి అభియాన్ కు సంబంధించిన గోడ ప్రతులను ఆవిష్కరించడం జరిగింది దీని ద్వారా ప్రతి గ్రామంలోని ప్రజలకు అవగాహన కల్పించవలసిందిగా వారు కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో తేలు విజయ. వాణి (బృందం) కళాకారులు వారి పాటల ద్వారా కూడా నీటిని పొదుపు చేయాలో పాటల ద్వారా తెలియజేయడం జరిగింది .
ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది ఆర్ ఐ రజిని, విఆర్ఓ రమేష్, యువజన సంఘాల సభ్యులు నక్క తిరుపతి, ప్రశాంత్, సతీష్, కుర్ర హరీష్,హరికాంతం అనిల్ రెడ్డి ,లక్ష్మణ్, మరియు యువకులు పాల్గొన్నారు.