contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం రూ.10000 ఆర్థిక సాయం ప్రకటించాలి. ..తుడుం ఓబులేసు డిమాండ్. మానవ హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

◆దాతలు గుప్త దానాలకు ముందుకు రావాలి.
◆అధికారులు ధరల నియంత్రణపై దృష్టి పెట్టాలి.
◆సడలింపు సమయాలలో పోలీసులు సంయమనం పాటించాలి.
 కష్టమని తన వద్దకు వస్తే శత్రువుకైనా సహాయం చేసే గొప్ప గుణం..ప్రతిమనిషిని ప్రేమగా ఆదరించే మనస్తత్వం..ఎదుటి వారిని గౌరవించే సంస్కారం.. ప్రజా సేవ పట్ల అంకితభావం..జనమంటే ఎనలేని అభిమానం..పేద నిరుపేదల పట్ల మూర్తి భవించిన మానవత్వం..నమ్మిన వారికోసం ఎంతకైనా తెగించి పోరాడే ధీరత్వం.మానవత్వానికి మంచితనానికి ఆయనే చిరునామా అతనే ప్రత్యేక పరిచయమే అక్కరలేని  హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు తుడుం ఓబులేసు.ప్రస్తుతం కరోన మహామ్మారి ప్రపంచమంతా కోరలు చాస్తూ కనిపించే వారినంత కబలిస్తు సర్వమానవాలిని కకావికాలం చేస్తున్న తరుణంలో ఆదివారం పట్టణంలోని తన కార్యాలయంలో తన భావాలను పల్లెవెలుగు ప్రతినిధితో పంచుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ వల్ల రోజుకూలీలతో జీవనం సాగిస్తున్న పేదల జీవితాలు దుర్భరంగా మారటం పై ఆందోళన వ్యక్తం చేశారు.గతంలో కేంద్ర ప్రభుత్వం నల్ల ధనాన్ని వెలికితీసి దేశంలోని  ప్రతి పేద కుటుంబానికి  రూ.15 లక్షలు పంపిణీ చేస్తామని హామిలిచ్చి అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం హామీలను మరిచిందని విమర్శించారు.కనీసం ఈ కష్ట కాలంలో నైనా కుటుంబానికి రూ.1లక్ష ఇచ్చి లాక్ డౌన్ ప్రకటించి ఉన్న ఎంతోమంది పేదలకు ఊరట కలిగేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.వెలకోట్లు బ్యాంకుల ద్వారా రుణం తీసుకొని విదేశాలలో విలాసంగా స్వర్గ సుఖాలను అనుభవిస్తున్న వారికీ రుణాలను మాఫీచేయటాన్ని తప్పుబట్టారు.ప్రస్తుత పరిస్థితుల్లో  ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి తమకు తోచిన,తమ శక్తి మేరకు పేదలకు అన్నదానాలు,ఆహారపు పొట్లాలు, నిత్యవసర సరుకులు,కూరగాయలు అందిస్తూ పేదలకు చేయుతనిస్తున్నా అవి సరిపోవడం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.మరికొంత మంది గోరంత దానం చేసి కొండంత ప్రచారం చేసుకుంటూ సరుకులను పంచుతూ ఫోటోలు దిగుతుండటం తో మధ్య తరగతి వారు ఇష్టపడక అభిమానం చంపుకోలేక దాతలు అందిస్తున్న సహాయాన్ని సైతం తీసుకోవటానికి నిరాకరిస్తు ఉన్నదాంట్లోనే అర్ధాకలితో గడిపేస్తున్నారని అన్నారు.తమ పేదరికాన్ని ఎత్తి చూపేల ఫొటోలు తీయటం కష్టంగ ఉందన్న వారి ఆత్మాభిమానాన్ని గుర్తించాలే తప్ప అహంకారం అనుకోకూడదని అన్నారు.దాతలు సైతం అలాంటి వారికి గుప్తంగా సహాయం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రతి వ్యక్తికి గౌరవంగా బ్రతికే హక్కు ఉందని గుర్తు చేశారు.అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా సభ్యులకు గుప్త దానాలపై అవగాహన కలిగించామని అన్నారు.తాను సైతం లాక్ డౌన్ విధించిన నాటి నుండి గుప్త దానాలకే ప్రాముఖ్యత నిస్తున్నానని అన్నారు.  పేదలకు అండగా,ఆప్తుడిగా ఆదుకుంటున్న తుడుం ఓబులేసు  దాతలు అందిస్తున్న సేవలను కొనియాడుతూనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా కాకుండా ప్రతి తెల్ల రేషన్ కార్డు దారుడికి ఇప్పుడున్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి కనీసం రూ.10000 అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన రూ.1000 కరెంట్ బిల్లుకు కూడా సరిపోలేదని ఎంతోమంది పేదలు వేదనలకు గురౌతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఉపాధి కోసం వలస వెళ్లిన కార్మికుల పరిస్థితి మరింత దయానియంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.కులవృత్తుల పై ఆధారపడిన కమ్మరి,కుమ్మరి,నాయి బ్రాహ్మణులు తదితర కుల వృత్తుల వారికి తక్షణమే ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.లేకపోతే పేదలు కరోనా కాటుకన్న ఆకలితో మృత్యువాత పడే ప్రమాదముందని అభిప్రాయం వ్యక్తం చేశారు.ఉపాధి కోల్పోయి,అప్పులు పుట్టక,అనారోగ్యాలతో సరియైన వైద్య సహాయం అందక పేదలు దినదిన గండం నురెళ్ళాయిషుగ జీవితాలను వెల్లదీస్తున్నారని అన్నారు.కంటికి కనిపించని కరోనా వైరస్ తో పోలీసులు,డాక్టర్ లు,మున్సిపాలిటీ,రెవెన్యూ అధికారులు యోధుల్లా తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాటం చేస్తున్నారని అయితే లాక్ డౌన్ సడలింపు సమయంలో మెడికల్ షాప్,కిరాణా దుకాణాలకు వెళుతున్న సామాన్యులపై కొంతమంది పోలీసులు కొన్ని చోట్ల లాఠీలు ఝళిపిస్తూ వివాదాలకు తెరలేపుతున్నారని అంటూ కొంతమంది పోలీసుల వల్ల ప్రజల్లో పోలీసుల పట్ల వ్యతిరేకతలు వినిపిస్తున్నాయని అన్నారు.ప్రజలు లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడకూడదని ప్రభుత్వం నిత్యవసర సరుకుల రవాణాకు సడలింపును కల్పించినా సరుకుల ధరలను పెంచి వ్యాపారులు సామాన్యుల నడ్డి విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.సరుకులను కృత్తిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించినా  వ్యాపారులు మాత్రం సరుకులను అధిక ధరకు విక్రయిస్తూనే ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు.ధరల నియంత్రణను పర్యవేక్షించాల్సిన అధికారులు కార్యాలయాలకు పరిమిత మౌతున్నారని  ఆరోపించారు.ధరలను అధికారులు కట్టడి చేయక పోవటంతో పేదలు,మధ్య తరగతి వారు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల పాలౌతున్నారని ప్రభుత్వం తక్షణమే ధరల నియంత్రణపై దృష్టి సారించి ప్రతి దుకాణం వద్ద ప్రభుత్వమే ఆయా వస్తువుల ధరలను ప్రకటించిన పట్టికను దుకాణ దారులు ప్రజలకు కనిపించేలా ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని ప్రజల హక్కులను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని హ్యూమన్ రైట్స్ కౌన్సిలాఫ్ ఇండియా తరుపున ప్రభుత్వాలకు గుర్తుచేస్తూ తక్షణమే సమస్యలపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నామని ఈ సందర్బంగా తుడుం ఓబులేసు తెలియజేసారు.
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :