శ్రీకాకుళం జిల్లా లో ఆర్మీ ర్యాలీ పేరిట తొమ్మిది వందల మందిని మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది . శ్రీకాకుళం జిల్లా శ్రీముఖిలింగం గ్రామానికి చెందిన బసవ వెంకటరమణ తానూ లెఫ్టినెంట్ అండర్ కవర్ ఆఫీసర్ అని చెప్పుకుంటూ …..సోషల్ మీడియా లో పలు రకాల ఫోటులు పెట్టి పలు గ్రామాల యువతను నమ్మించాడు . బాధితుల వివరాల ప్రకారం 2019 ఆగస్టు 26 న ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనే పేరుతో బసవ వెంకటరమణ ఆర్మీ చేరాలనుకునే యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు . దీంతో అతడిని నమ్మిన నిరుద్యోగ యువత ఆశపడి శ్రీకాకుళం నగరం లోని 80 అడుగుల రోడ్డులోని ఓ అతిధి గృహంలో శ్రీకాకుళం , విజయనగరం , విశాఖపట్నం , తూర్పుగోదావరి , పచ్చిమగోదావరి జిల్లాల యువకులు సుమారు 900 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు . 105 మంది నిరుద్యోగుల వద్ద.. ఒక్కొక్కరి దగ్గర నుండి మూడు లక్షలు చొప్పున సుమారు మూడు కోట్ల వరకు వసూల్ చేసుకొని పరారైనట్టు సమాచారం .
బాధితులు ఆనాటి ఎస్పీ అమ్మిరెడ్డి కి ఫిర్యాదు చేస్తే బసవ వెంకటరమణ ని పట్టుకొని శిక్ష పడేలా చూస్తానని హామీ ఇచ్చినట్లు వార్తా పత్రికలలో వార్తలు వెలువడ్డాయి . మరల ఈ మధ్యకాలం లో బసవ వెంకట రమణ సోషల్ మీడియా లో ప్రత్యేక్షమై సైనికులను , మాజీ సైనికులను తిడుతున్న వీడియో లు వైరల్ అయ్యాయి . దీంతో ఆగ్రహించిన యువత వెంకటరమణ పై విరుచుకుపడ్డారు .
అసలు ఈ వెంకటరమణ ఎవరు ? నిజంగా ఆర్మీ ఆఫీసరా ? లేక దొంగ ఆఫీసరా ? పూర్తివివరాలు సేకరించేపనిలో పడ్డారు మా ప్రతినిధులు .
ఆర్మీ , నేవీ లో చేరాలనుకులే యువత డబ్బుకి మోసపోకుండా కష్టాన్ని నమ్ముకోండి . మోసగాళ్లకు .. మాయగాళ్లకు దూరంగా ఉండి తమ లక్ష్యాలను బాగా చదివి సాధించుకోవాలని రిపోర్టర్ టివి ఆకాంక్షితుంది .