కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం గ్రామ శివారులోని చెరువు కట్ట సమీపంలో మూలమలుపు వద్ద బైక్ ప్రమాదం చోటుచేసుకుంది వివరాల్లోకి వెళ్తే హన్మజిపల్లె గ్రామానికి చెందిన కల్లేపల్లి సంజీవ్ 31-03- 2021 రోజున సాయంత్రం 5:30 సమయంలో హన్మజీపల్లి నుండి చొక్కారావు పల్లెకు వెళ్తుండగా మైలారం గ్రామ శివారులోని కట్ట సమీపంలో ఫైబర్ లైన్ కోసం తవ్విన గుంత ను తప్పించబోయి ప్రమాదవశాత్తు బైక్ నుండి కింద పడి తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడే పడిపోయాడు అక్కడే ఉన్న రైతు చూసి స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి 108 ఆంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా నిన్న అనగా 01-04-2021 రోజున మధ్యాహ్నం 3 గంటలకు చికిత్స పొందుతూ మృతి చెందాడు మృతునికి భార్య రేణుక కుమారుడు ఉన్నారు మృతిని తమ్ముడు మహేందర్ గన్నేరువరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు