contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

బంగ్లాదేశ్ యుద్ధ విజయోత్సవాలు… సీఎం జగన్ ను ఆహ్వానించిన భారత సైన్యం

 

బంగ్లాదేశ్ విమోచన యుద్ధానికి 50 ఏళ్లు అయిన సందర్భంగా భారత సైన్యం గోల్డెన్ జూబ్లీ విజయోత్సవాలు నిర్వహిస్తోంది. ఈ యుద్ధంలో పాకిస్థాన్ సేనలపై భారత సైన్యం స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో భారత ఆర్మీ ఫిబ్రవరి 18న తిరుపతిలో వేడుకలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా భారత సైన్యం ఏపీ సీఎం జగన్ ను ఆహ్వానించింది. ఏపీ, తెలంగాణ ప్రాంతాల జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ ఆర్కే సింగ్ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా సీఎంకు ఆహ్వాన పత్రిక అందజేశారు. సైన్యం ఆహ్వానం పట్ల సీఎం జగన్ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :