మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిన్నయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్తు, ప్రైవేటు పరం చేస్తూ సామాన్య ప్రజానీకానికి తల్లనొప్పిగా మారిందన్నారు.
బెల్లంపల్లి మండలంలోని శ్రవణ్ పల్లి ఓపెన్ కాస్ట్ మైన్ ను ప్రైవేట్ పరం చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారని, దానికి నిరసనగా కార్మిక లోకానికి మద్దతుగా ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుందని తెలిపారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో సింగరేణి, ప్రభుత్వ భూముల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్న వారికి పట్టాలు ఇప్పించడం జరుగుతుందని, కొన్ని పొరపాట్ల వలన కొందరికి దరఖాస్తు రుసుం ఎక్కువగా వచ్చినందున కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బిజేపి నీచ రాజకీయాలు చేస్తూ, పేపర్ లీకేజీ లు చేస్తూ యువకుల జీవితాలతో చెలగాటం ఆడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తుందని. దేశంలోనే సంక్షేమ పథకాలతో ముందున్న రాష్ట్రాన్ని అబాసుపాలు చేస్తుందన్నారు. తనపై వస్తున్న ఆరోపణలు నిజాలు కావని, బెల్లంపల్లిలో బిఆర్ఎస్ మళ్ళీ గెలుస్తుందనే కుట్రతో ఒక మహిళను అడ్డు పెట్టుకొని వీడియో లు సృష్టించి సోషల్ మీడియాల ద్వారా వైరల్ చేస్తున్నారని, అరిజీన్ డైరీ పాల వ్యాపారం పేరుతో ఆంధ్రప్రదేశ్ లో అమాయక ప్రజలను మోసం చేసి అనేక కేసులు ఉన్న సంస్థ ప్రతినిధులు ఇక్కడకు వచ్చి ఇక్కడి రైతులను మోసం చేయడమే కాకుండా ఆ నేపాన్ని తనపై నెట్టి లబ్ధిపొందాలని పన్నాగం పన్నారని, వారి మోసాలకు రైతుల దగ్గర నుండి డబ్బులు ఎలా వసూలు చేసారో బ్యాంక్ లావా దేవీల స్టేట్మెంట్ లే నిదర్శనమని అన్నారు. నాపై లేనిపోని కథలు అల్లి అనేక ఆరోపణలు చేస్తున్నారని, వారి వెనుక ఉండి నడిపిస్తున్నది ఎవరనేది త్వరలోనే బయటకు వస్తుందని, నిజం నిప్పులాంటిదని అన్నారు.