బాలీవుడ్ నటి కైరా అద్వానీతో మరొక్కసారి జోడి కట్టనున్నట్లు సమాచారం. సరిలేరు సక్సెస్ తో మంచి జోరుమీదున్న సూపర్ స్టార్, తదుపరి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. గతంలో మహేష్, వంశీ కాంబినేషన్ లో వచ్చిన మహర్షి సినిమాకు పూర్తి భిన్నంగా మాఫియా బ్యాక్ డ్రాప్ లో పూర్తి మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు మంచి స్కోప్ ఉందని, అయితే అటువంటి పాత్రకు కైరా అయితే న్యాయం చేయగలదని భావించిన వంశీ ఆమెను తీసుకునేందుకు సిద్ధం అయ్యాడట. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్లిన మహేష్ తిరిగి రాగానే కైరా విషయమై చర్చించి, ఫైనల్ గా కథను ఆమెకు వినిపిస్తారని సమాచారం.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference