ఇటీవల బీజాపూర్ ఘటనలో ప్రాణాలొదిలిన జవానులకు నివాళులు అర్పించేందుకు పారామిలటరీ వెల్ఫేర్ అసోసియేషన్ లోని పదవి విరమణ సైనికులు మరియు ప్రస్తుత సర్వీసులో ఉన్న సైనికుల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఏడురోడ్ల జంక్షన్ నుండి కోడి రామ్మూర్తి స్టేడియం వరకు ర్యాలీగా వెళ్లి మైదానం వద్ద ప్రాణ త్యాగం చేసిన జవానులకు ఆత్మ శాంతి చేకూరాలని అశ్రునయనాలతో కొవ్వొత్తులు వెలిగించి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. దేశం కోసం పోరాడి ప్రాణ త్యాగం చేసిన వీరులకు జిల్లాలోని మాజీ పారా మిలటరీ సైనికులు అయిన కే రామారావు, ఎస్ లక్ష్మణ్ రావు, భానోజీ రావు, రామారావు, బి.యమ్ మూర్తి గారు మరియు సేవలో ఉన్న సైనికులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. న్యూస్ టుడే అసోసియేషన్ ముఖ్య సభ్యులైన అట్ల సుమన్ మరియు కోట్ని లక్ష్మణ్ రావు గారు మాట్లాడుతూ ఒక దేశానికి రక్షణ బాధ్యత చూసే సైన్యం, వాటి వీధులన్నీ ప్రస్తుతం మన దేశంలో పారామిలటరీ దళాలకు లేదా కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు అప్పగించడం జరిగింది. మన దేశానికి ఇతర దేశాలతో ఉన్న అన్ని సరిహద్దుల్లో, ( నేపాల్ మరియు భూటాన్- భారత్, సశస్త్ర సీమ బల్ (SSB ) పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ – భారత్, భారత సరిహద్దు దళం ( BSF) చైనా – భారత్ సరిహద్దుల్లో ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ( ITBP) మయన్మార్ – భారత్ అస్సాం రైఫిల్ ( ASR) మరియు దేశ అంతర్గత శాంతి భద్రత విషయాలన్నీటిలోను రాష్ట్ర పోలీసులకు సహకరించే CRPF, పారిశ్రామిక, విమానాశ్రయ, నౌకాయ భద్రతను చూసే CISF గాని రక్షణ మరియు భద్రత లను చూస్తూ రేయింబవళ్ళు కేంద్ర సాయుధ బలగాలు విధుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం గానీ ప్రజలు గాని తగిన గుర్తింపు గౌరవం ఇవ్వడం లేదని సైనిక వీధులన్నీ నిర్వహించుకొని ఒక సైనికుని కి ఇవ్వవలసిన సౌకర్యాలు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు అయినా CRPF, BSF, ITBP, SSB, CISF, ASSAM RIFLES, దళాలకు ఇవ్వటం లేదని తెలియజేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కేంద్ర భద్రతా బలగాలు చేస్తున్నటువంటి విధులను గుర్తించాలని విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన వీరుల కుటుంబాలకు ఆదుకునే సైనిక సంక్షేమంపై సమీక్ష జరిపి అందరి సైనికులకు ప్రభుత్వ సైనిక సంక్షేమ పథకాలు అందాలని విజ్ఞప్తి చేశారు. ఈ అసోసియేషన్ సేవా కార్యక్రమాలను, సైనికులను, దేశ సైనికుల సంక్షేమ దృశ్య మాత్రమే చూడగలరని విన్నవించారు.