బెంగళూరు హింసాకాండకు సంబంధించిన కేసులో కాంగ్రెస్ నేత, బృహన్ బెంగళూరు మునిసిపల్ కార్పొరేషన్ (బీబీఎంసీ) నాగ్వారా వార్డు కార్పొరేటర్ ఇర్షాద్ బేగం భర్త కలీంపాషాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో 60 మందిని అరెస్ట్ చేశామని, 206 మందిని అదుపులోకి తీసుకున్నామని బెంగళూరు జాయింట్ పోలీసు కమిషనర్ సందీప్ పాటిల్ తెలిపారు. ఈ కేసులో తాజాగా అరెస్ట్ అయిన కలీంపాషా మాజీ సీఎం సిద్ధరామయ్యతో కలిసి ఉన్న ఒకప్పటి ఫొటో వెలుగులోకి వచ్చి వైరల్ అవుతోంది. అలాగే, కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కేజే జార్జ్‌కు సన్నిహితుడని పోలీసులు తెలిపారు.