శనివారం భద్రాచలం పట్టణ SI మహేష్ తన సిబ్బందితో పెట్రోలింగ్ చేస్తుండగా భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఇద్దరు వ్యక్తులు ఒక గోనె సంచి మరియు లగేజ్ బ్యాగ్ తో తిరుగుతుండగా, అనుమానంతో వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నున్న సంచులను సోధ చేయగా లిక్విడ్ ఎక్సప్లోజివ్ లభ్యమయ్యాయి. వారిని విచారించగా వారి పేర్లు 1) కుంజం ఊర(30), S/O బోటి, ST /గొత్తేకోయ, వృత్తి వ్యవసాయం, R/O నర్సాపూర్, పూసుబాక(POST), బీజాపూర్ (Dist) , ఛత్తీస్గడ్ రాష్ట్రం. 2) కుంజం మంగా (22), S/O అడమ, ST /గొత్తేకోయ, వృత్తి వ్యవసాయం, R/O నర్సాపూర్, పూసుబాక(POST), బీజాపూర్ (DIST) , ఛత్తీస్గడ్ రాష్ట్రం అని తెలిపినట్లు, వారు ఈ పేలుడు పదార్ధాలను మావోస్టులకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలగా వీరి వద్దనుండి ఎక్సప్లోజివ్ తో పాటు ఒక ద్విచక్ర వాహనం ను స్వాధీన పరచుకొని కేసు నమోదు చేసినట్లు భద్రాచలం ASP తెలియజేసారు