భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చర్ల మండలం: జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ ఆదేశాల మేరకు భద్రాచలం పట్టణ సీఐ వినోద్ సూచనలతో ఈ రోజు పట్టణ ఎస్. ఐ మహేష్ అటవీ చెక్ పోస్ట్ దగ్గర వాహన తనిఖీలు చేస్తూ ఉండగా హోండా సిటీ AP 03 R 6999 నంబరు గల కారు అనుమానాస్పదంగా కనిపించగా ఆ కారును ఆపి తనిఖీ చేయగా అందులో నలుగురు వ్యక్తులు నిషేధిత గంజాయితో ఉండడాన్ని గమనించి వారి వివరాలు అడిగి తెలుసుకోగా
1) దారావత్ వెంకన్న S/O బిక్ష, లంబాడా, అగ్రికల్చర్ R/O వాటర్ ట్యాంక్ తాండా విలేజ్, నందిపహాద్ పోస్ట్, మిర్యాలగుడ, నల్గొండ జిల్లా.2).దారావత్ రమణ S/o మాంగ్యా, లంబాడా, వ్యవసాయం,R/o.మైసమ్మ కుంట తాండా నందిపహాద్ పోస్ట్, మిర్యాలగూడ,నల్గొండ జిల్లా.3) రూపవత్ రవి S/O హనుమా, 35 సంవత్సరాలు, లంబాడా,వ్యవసాయం R/O వాటర్ ట్యాంక్ తండా గ్రామం, నందిపహాద్ పోస్ట్, మిర్యాలగూడ మండలం, నల్గొండ జిల్లా.4)మేఘవత్ పాండు దేవా S/O సైదా, 25 సంవత్సరాలు,లంబాడా,ఆటో డ్రైవర్ మైసమ్మ కుంట తండా నందిపహాద్ పోస్ట్, మిర్యాలగుడ, నల్గొండ జిల్లా అని చెప్పి చింతూరు మండలం నుండి గంజాయిని హైదరాబాద్ కు తరలిస్తున్నారని, అట్టి గంజాయి 71.4 కేజీలు కలిగి ఉన్నది. దీని విలువ 10,71000/- గా ఉండును. అనంతరం కేసు నమోదు చేయనైనది. భద్రాచలం పట్టణం ఆంధ్ర ఒరిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్నందున పట్టణంలో నిరంతర తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి గంజాయి మరియు ఇతర నిషేధిత వస్తువుల రవాణా చేస్తూ అక్రమాలకు పాల్పడే వారిపై పూర్తిగా నిఘా ఉంచి కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఏ వాహనం అయినా సరే పోలీసుల పూర్తి తనిఖీ అనంతరం మాత్రమే భద్రాచలం దాటవలసి ఉంటుందని సిఐ వినోద్ మరొకసారి హెచ్చరించారు. గడిచిన సుమారు రెండు నెలల కాలంలో సుమారుగా 3,30,00,000/- విలువగల 2200 కేజీల గంజాయిని పట్టుకొని స్వాధీనపరచుకొనైనది. ఈరోజు పట్టుబడిన నిందితులను రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించడం జరిగిందని సీఐ తెలియజేసినారు.