కరీంనగర్ జిల్లా: మానకొండూరు,శంకరపట్నం, గన్నేరువరం,తిమ్మాపూర్, చిగురుమామిడి, బెజ్జంకి, మండలంలో ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు గ్రామాల్లో రైతులు వేసుకున్న వరి పంటలు పూర్తిగా నేలమట్టం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వ అధికారులు పంట దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించి రైతులకు నష్టపరిహారం అందేలా పంట వివరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతున్నారు ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులతో మాట్లాడి దెబ్బతిన్న వరి పంట వివరాలను సేకరించి నష్టపరిహారం అందే విధంగా అధికారులు కృషిచేసి రైతులను ఆదుకోవాలని మానకొండూర్, శంకరపట్నం, గన్నేరువరం,తిమ్మాపూర్, చిగురుమామిడి, బెజ్జంకి, మండలాల్లోని గ్రామాలరైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు