కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం : నిరంతరం దేశసేవలో నిమగ్నమైన మహనీయులు మహాత్మా గాంధీ,లాల్ బహదూర్ శాస్త్రీ ల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని బీజేపీ తిమ్మాపూర్ మండల శాఖ అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరా చారి పేర్కొన్నారు శుక్రవారం జాతిపిత మహాత్మా గాంధీ,మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రీ ల జయంతి సందర్బంగా మండలంలోని పర్లపల్లి గ్రామంలో వేడుకలు నిర్వహించి స్వీట్లు పంపిణీ చేసారు.ఈ సందర్బంగా గాంధీ విగ్రహానికి,శాస్త్రీ చిత్రపటానికి పూల మాలలు వేసి జోహార్లు పలికి నివాళులు అర్పించారు. హింసాత్మక చర్యలతొ ఏదీ సాదించలెమని చెప్పిన గాంధీ,ఎంతటి పదవిలో ఉన్నా నిరాడంబరంగా బతకాలని సమాజానికి తెలిపిన శాస్త్రీ ల ఆశయాలను బతికించె విదంగా ప్రయత్నం చెయ్యాలని కార్యకర్తలకు సూచించారు.ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు గొట్టిముక్కుల తిరుపతి రెడ్డి,కిన్నెర అనిల్, ఉపాధ్యక్షులు మార్క హరిక్రిష్ణ గౌడ్, బిజెవైఎం అధ్యక్షులు గడ్డం అరుణ్,సీనియర్ నాయకులు బూట్ల శ్రీనివాస్, మావురపు సంపత్,ఎర్రోజు లక్ష్మణ్,కేతిరెడ్డి సత్య నారాయణ రెడ్డి, బుర్ర శ్రీనివాస్ గౌడ్,ఐల రాజశేఖర్,బూరుగు శ్రీనివాస్ రెడ్డి,కొమ్మెర రాజిరెడ్డి,కరివేద శ్రీనివాస్ రెడ్డి ,కీసర సతీష్,కీసర గోపాల్,గొల్ల కొమురయ్య, శాబోలు గణేష్,ఆరేళ్ల అన్వేష్,కుమార్,రేగూరి సుగుణాకర్, ప్రశాంత్,శ్రీకాంత్, శ్రీనివాస్,నరేష్,రాజు,మల్లయ్య పటేల్ తదితరులు పాల్గొన్నారు.