contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మహరాష్ట్రలో భారీ ఎన్ కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి !

 

మహరాష్ట్రలోని గడ్చిరోలి  జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఖురుకేడ తాలుక కొబ్రామెండ అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య  ఉదయాన్నే ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు  మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. వీరిలో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులున్నారు. అటు పోలీసులు అదనపు బలగాలను రప్పించి  మరీ  కూంబీంగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. తప్పించుకున్న వారి కోసం గాలింపు జరుగుతోందని.. నక్సల్స్‌ను మొత్తం ఏరివేసేవరకు ఈ ఆపరేషన్‌ కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మృతి చెందగా.. మరికొంత మంది మావోయిస్టులకు తీవ్ర గాయాలు అయినట్లు అధికారులు వెల్లడించారు..

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :