మహాలక్ష్మి పథకం ప్రారంభం .. ప్రోసిడింగ్ పత్రాలు అందజేత : ఎమ్మెల్యే జీఎమ్మార్సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో.. మహాలక్ష్మి పథకాన్ని లాంచనంగా ప్రారంభించి, లబ్ధిదారులకు ప్రోసిడింగ్ పత్రాలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అందజేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా.. మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి.. లబ్ధిదారులకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించడం జరుగుతోందని తెలిపారు.
పటాన్చెరు నియోజకవర్గం వ్యాప్తంగా మహాలక్ష్మి పథకం ద్వారా 34,698 మంది లబ్ధిదారులకు సబ్సిడీ గ్యాస్ అందిస్తున్నామని తెలిపారు.
కార్పోరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, సింధు ఆదర్శ్ రెడ్డి, పుష్ప నగేష్, ప్రత్యేక అధికారి దేవూజ, ఎమ్మార్వో రంగారావు, ఎంపీడీవో యాదగిరి, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సురేష్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజు, తదితరులు పాల్గొన్నారు