అల్లు అర్జున రికార్డుల కోసం ధియేటర్ల సంఖ్య కోసం జనవరి 10 పై మోజు పడుతున్నా ఆ డేట్ కు ఒక నెగిటివ్ సెంటిమెంట్ ఉంది. జనవరి 10 డేట్ వినగానే త్రివిక్రమ్ కు ‘అజ్ఞాతవాసి’ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి ఆడేట్ వద్దు అంటూ ఇప్పటికే అరవింద్ కు అదేవిధంగా బన్నీకి చెప్పినట్లు తెలుస్తోంది. దీనికితోడు రెండు భారీ సినిమాలకు ఇష్టం వచ్చినట్లు డేట్స్ మార్చడం అంత సులువైనది కాదనీ ఇప్పటికే ఈరెండు సినిమాలకు సంబంధించిన ధియేటర్ల ఎగ్రిమెంట్ లు పూర్తి అయిన పరిస్థితులలో వాటిని మళ్ళీ తిరిగి రాయడం అంత సులువైన పని కాదనీ అలాంటి పరిస్థితులే ఎదురైతే బన్నీ సినిమాకు మేజర్ డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తున్న దిల్ రాజ్ తాను ‘అల వైకుంఠపురములో’ డిస్ట్రిబ్యూషన్ నుండి తప్పుకుంటాను అంటూ లీకులు ఇస్తున్న పరిస్థితులలో ఈరగడకు సంబంధించిన అసలు విషయాలు రేపు మాత్రమే తెలుస్తుంది..అల్లు అర్జున్ ఇలా ఎవరు ఊహించని విధంగా తన మూవీని ఈనెల 12న కాకుండా 10న విడుదల చేయాలి అని నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఒకపార్టీలో జరిగిన సంఘటన అంటున్నారు. ఈమధ్య ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన ఒక ప్రముఖ వ్యక్తి ఇంటిలో జరిగిన పార్టీలో మహేష్ బన్నీ గురించి ‘అల వైకుంఠపురములో’ మూవీ గిరించి తక్కువ చేసి మాట్లాడాడు అని ఈవిషయాలు బన్నీ దృష్టి వరకు వెళ్ళడంతో సంక్రాంతి రేసులో ముందుగా వచ్చి మహేష్ కు ఊహించని షాక్ ఇవ్వాలి అని నిర్ణయించుకున్నాడు అన్న గాసిప్పులు ఉన్నాయి.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )