contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మాదక ద్రవ్యాలు జీవితాలను నాశనం చేస్తాయి: ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి .పాటిల్ ఐపీఎస్

ములుగు జిల్లా: బుధవరంనాడు ములుగు జిల్లా పోలీసులు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న  ముఠాను  అరెస్టు చేసి  భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు .ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ ఉద్దేశించి ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఐపీఎస్ గారు మాట్లాడుతూ ప్రజలు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ముఖ్యంగా విద్యార్థులు మరియు నిరుద్యోగ యువకులు మాదక ద్రవ్యాలకు బానిస ఐతే భవిష్యత్తు అంధకారం అవుతుంది అని తెలియజేశారు. జిల్లా ఎస్పీ అందించిన వివరాల ప్రకారం బుదవారం  ఉదయం 06.00 గంటల ప్రాంతంలో  ఇంచెర్ల  ఎర్రి గట్టమ్మ గుడి, ములుగు  CI గారి  ఉత్తర్వుల  మేరకు SI  వెంకటాపూర్ గారు వారి సిబ్బంది  తో  వాహనాలు తనికి చేస్తుండగా , TS24C 9813 నెంబర్ గల సిమెంట్ కలర్   మారుతీ  బెలోన కారు   పస్ర  నుండి ములుగు  వస్తు,   పోలీసులను చూసి కారులోని వ్యక్తులు పారిపోవుటకు ప్రయత్నిచగా, SI  వెంకటాపూర్ గారు వారి సిబ్బంది  ఇద్దరు వ్యక్తులను  పట్టుకోగా ఒక వ్యక్తి  పారిపోయాడు. SI  వెంకటాపూర్ కారును  తనికి చేయగా  అందులో   రెండు కిలోల బరువు ఉండే  బ్రౌన్  కలర్  షీట్స్   చుట్టిన  87 ప్యాకేట్స్ ఉన్నాయి.  వెంటనే SI  వెంకటాపూర్ గారు , ములుగు  తహిసిల్ధర్  గారిని  పిలిచి, ఇద్దరు పంచుల సమక్షం లో  పట్టుకున్న వ్యక్తులను విచారించగా చెక్క  కుమార్ స్వామి  కారు డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు అని,  కానీ  డ్రైవర్  గా పనిచేయగా వచ్చే  డబ్బులు తన కుటుంబ పోషణకు సరిపోకపోగా, ఏమి చేయాలి అని  అలోచేస్తున్న క్రమలో   గత  నెల రోజుల  క్రితం పందికుంట ఊరిలో వారి బంధువుల ఇంటికి వచ్చిన గోరుకోతపెల్లీ గ్రామానికి చెందిన శంకర్ అనే వ్యక్తి పరిచయం అవ్వగా,  కుమార స్వామి తన   యొక్క ఆర్ధికస్థితి  చెప్పగా,  అతడు  కుమార  స్వామికి  గంజాయి వ్యాపారం గురించి   చెప్పి, ఒక్క సారి  నాతో గంజాయి  వ్యాపారానికి వస్తే ఆర్థిక  సమస్యలు అన్ని పోతాయి అని చెప్పగా,  15  రోజుల  క్రితం ఒక్కసారి శంకర్  పందికుంటకు వచ్చి, రెండు మూడు  రోజుల్లో, ఆంధ్రప్రదేశ్ లోని, వెస్ట్ గోదావరి జిల్లా, లక్కవరం  గ్రామానికి  వెళ్లి గంజాయి తీసుకొద్దాం , ఇంకో ఎవరైనా ఉంటె  తీసుకొని రా  అని చెప్పగా కుమార స్వామి   పందికుంట గ్రామానికి చెందిన వారి బంధువైన రాగుల పోశాలుకు  విషయం చెప్పగా అతడు ఒప్పుకున్నాడు. ముగ్గురు కలిసి వెళ్లి, లక్కవరం   గ్రామం లో  శంకర్ కు తెలిసిన వ్యక్తి  వద్ద 20 కిలోల గంజాయి,  కిలో 1500 /-  రూపాయల  చొప్పున  కొని, పందికుంట వచ్చి,  పోశాలు వారి ఇంట్లో  పెట్టగా,  ఎవరో హైదరాబాద్ నుండి వచ్చి కిలో 8000 /- రూపాయల  చొప్పున    తీసుకొని వెళ్ళిరని అప్పుడు శంకర్ అందులోనుండి, పోశాలుకు మరియు నాకు వాటా ఇచ్చాడని చెప్పాడు.  అదే విధముగా,  తేది 04-08-2020, రోజు కుమార స్వామి, శంకర్  మరియు పోశాలు కలిసి  శంకర్  యొక్క మారుతీ  బెలోన కార్ నెంబర్  TS24C 9813 లో  పందికుంట  నుండి బయలు దేరి ఆంధ్రప్రదేశ్ లోని, వెస్ట్ గోదావరి జిల్లా, లక్కవరం  గ్రామానికి  వెళ్లి,అక్కడ  శంకర్ కు తెలిసిన వ్యక్తి  వద్ద 174 కిలోల గంజాయి కొని  తీసుకెళ్ళిన  కారు డిక్కీలో లోడ్ చేసుకొని,  రాత్రి  అందజ 1130 గంటల ప్రాంతంలో  అక్కడి నుండి బయలు దేరి,  పందికుంట కు వస్తుండగా,  ఇంచెర్ల , గట్టమ్మ గుడి వద్దకు  వచ్చే సరికి  పోలీస్ వారు కారును  ఆపగా, ముందు సీటులో కూర్చున్న శంకర్ కారు దిగి పారిపోయాడు   కుమార  స్వామి మరియు పోశాలు  కారు వదిలి పారిపోవుటకు ప్రయత్నచగా పోలీసులు పట్టుకున్నారు. గంజాయ్ స్వాధీనంలో ముఖ్యభూమిక పోషించిన సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.
 నేరస్తులు : 
 
1) చెక్క  కుమార్ స్వామి  S/o కొమ్మలు, వయస్సు: 35 సo, , కులం:ముదిరాజ్, వృతి:  డ్రైవర్, R/o పందికుంట, ములుగు మండల  
2) రాగుల  పోశాలు, S/o అల్లయ్య , వయస్సు: 65 సo, , కులం:ముదిరాజ్, వృతి: కూలి, R/o పందికుంట, ములుగు మండల  
3) శంకర్ , R/o గోర్కోతపల్లీ, రేగొండ మండల, జయశంకర్ భుపాలపల్లి జిల్లా. 
స్వాధీనం చేసుకున్న  వాటి  వివరాలు:
1) 87 ప్యాకేట్స్ లో , 174 కిలోల గంజాయి, అట్టి గంజాయి  విలువ 13,92,000/-
2) TS24C 9813 మారుతీ  బెలోన కార్
ఈ కార్యక్రమంలో ములుగు ఏ ఎస్ పి శ్రీ పి. సాయి చైతన్య ఐపీఎస్, ములుగు CI శ్రీ కే .దేవేందర్ రెడ్డి, వెంకటాపూర్ ఎస్సై శ్రీ నరహరి మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :