కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం ఖాసీంపెట్ గ్రామానికి చెందిన కయ్యం సంపత్ కుమార్ మానకొండూరు నియోజకవర్గ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ యువజన విభాగంలో ప్రధాన కార్యదర్శిగా శుక్రవారం ఆయనకు నియామక పత్రాన్ని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అందజేసి శుభాకాంక్షలు తెలిపారు అయిన నియామకం పట్ల ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు కృతజ్ఞతలు తెలిపారు సంపత్ కుమార్ మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని యువకులతో పార్టీ ముందుండేలా కృషి చేస్తానని అన్నారు మానకొండూరు నియోజకవర్గ యువ నాయకులు కయ్యం సంపత్ కుమార్ ను ఎన్నిక చేసినందుకు మండల ప్రజలు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు యువకులు టపాకాయలు పేల్చి హర్షం వ్యక్తం చేశారు యువకులు స్వీట్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి, టిఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు బద్దం తిరుపతిరెడ్డి, గంప వెంకన్న, యువజన విభాగం అధ్యక్షుడు గూడూరి సురేష్, శ్రీనివాస్ గుప్తా, తదితరులు పాల్గొన్నారు