పల్నాడు జిల్లా – పిడుగురాళ్ల : గురజాల మాజీ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలోని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు ఏసుప్రభు మాల ధరించి 40 రోజులు దీక్ష చేసిన వారికి నాగపట్నం వెళ్లడానికి బస్సు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ రోజున సాయంత్రం 6 గంటలకు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి వర్ల రత్నం స్వామి[నల్లి] ఆధ్వర్యంలో40 మంది నాగపట్నం బయలుదేరి వెళ్లారు . తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాండురంగ శ్రీను, రాష్ట్ర వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు కనిగిరి శ్రీను ఆధ్వర్యంలో జెండా ఊపి ప్రయాణానికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.