ఐదు రోజులుగా రాకేశ్వర్‌సింగ్ మావోల చెరలో ఉన్నాడు. రాకేశ్వర్‌సింగ్ విడుదలను ఛత్తీస్‌గఢ్ ఐజీ ధృవీకరించారు. తెర్రం పోలీస్‌స్టేషన్ పరిధిలో రాకేశ్వర్‌సింగ్‌ను మావోయిస్టులు వదిలేశారు. కాసేపట్లో బెటాలియన్‌కు జవాన్ చేరుకోనున్నాడు. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో రాకేశ్వర్‌సింగ్‌ను నక్సలైట్లు బందీగా తీసుకెళ్లారు. రాకేశ్వర్‌సింగ్ విడుదల కోసం మావోలు ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు కూడా పెట్టారు. అతడు క్షేమంగానే ఉన్నాడని, త్వరలో విడుదల చేస్తామని మావోయిస్టులు చెప్పారు. బుధవారం తమ చెరలో ఉన్న రాకేశ్వర్ ఫొటోను మీడియాకు విడుదల చేశారు.మావోయిస్టులు తమ అధీనంలో కి తీసుకున్న కోబ్రా కమాండో రాకేశ్వర్‌సింగ్‌ను వెంటనే విడుదల చేయాలని నిర్బంధ వ్యతిరేక వేదిక విజ్ఞప్తి చేసింది. అదేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చల దిశగా ముందడుగు వేయాలని నిర్బంధ వ్యతిరేక వేదిక కన్వీనర్ ప్రొఫెసర్ జి.హరగోపాల్, కో కన్వీనర్లు ప్రొఫెసర్ జి.లక్ష్మణ్, ఎం.రాఘవాచారి, కె.రవిచందర్ బుధవారం ఒక ప్రకటనలో కోరిన విషయం తెలిసిందే.