జమ్ముకశ్మీర్‌లో టెర్రరిస్టులతో జరిగిన పోరులో వీరమరణం పొందిన నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమన్పల్లి గ్రామానికి చెందిన ర్యాడా మహేష్‌కు, ఐరాల పల్లె రెడ్డివారి పల్లె కు చెందిన చీకాల ప్రవీణ్ కుమార్ రెడ్డి కు ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్ – ఇండియా జాతీయ అధ్యక్షులు వి.సుధాకర్ నివాళులు అర్పించారు . ‘మమ్మల్ని సురక్షితంగా ఉంచినందుకు ధన్యవాదాలు. మీ వీరత్వం ఎప్పటికీ మరచిపోలేం’ మహేష్,ప్రవీణ్ కుమార్ రెడ్డి తో పాటు వీరమరణం పొందిన తోటి సైనికులకు నా జోహార్లు..వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ అంటూ వి.సుధాకర్ సంతాపం తెలిపారు.