భారత జట్టు ‘అండర్ 19’ వైస్ కెప్టెన్ షేక్ రషీద్ ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. అండర్ 19 వరల్డ్ కప్ లో భారత్ జయకేతనం ఎగురవేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రషీద్ ను జగన్ అభినందించారు. ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలను అందిస్తామని చెప్పారు. రూ. 10 లక్షల నగదు బహుమతిని ఇచ్చారు. గుంటూరులో నివాస స్థలాన్ని కేటాయించారు. ఏపీ క్రికెట్ అసోసియేషన్ తరపున ప్రకటించిన రూ. 10 లక్షల చెక్కును రషీద్ కు అందించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు మేకతోటి సుచరిత, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, శాప్ అధికారులు, రషీద్ తండ్రి బాలీషా పాల్గొన్నారు. రషీద్ తండ్రి బ్యాంక్ ఉద్యోగి. తొమ్మిదేళ్లకే రషీద్ అండర్ 14లో అడుగుపెట్టాడు.