భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల సిఐ తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయం నుండి చర్ల ఎస్ఐ తన సిబ్బంది, స్పెషల్ పార్టీ పోలీసులు,141 సిఆర్ పిఎఫ్ పోలీసులతో తాలిపేరు డ్యామ్ నుండి పెద్ధమిడిసెలెరుకు వెళ్ళు మార్గంలో వాహనాల తనికి చేయుచుండగా సుమారు ఐదు గంటల సమయంలో తిప్పాపురం నుండి పెద్ధమిడిసెలెరుకు నడుచుకుంటా ముగ్గురు వ్యక్తులు వస్తు పోలీసులను చూసి పారిపోవుచుండగా పోలీసులు వెంబడించి ముగ్గురిని పట్టుకొని విచారించగా వారి పేర్లు {పేరు(వయస్సు), తండ్రి పేరు, కులం, గ్రామం, మండలం}
1)వెట్టి భీమరాజు@రాకేశ్(24), లింగయ్య, గొత్తికోయ,కిస్తారాంపాడు, చర్ల.
2) సున్నం నాగేశ్వర్రావు(25), ముత్తయ్య, కోయ, బత్తినపల్లి, చర్ల.
3) వెల్కం పెంటయ్య(25), బాలయ్య(లేటు), బత్తినపల్లి, చర్ల
అని వారు గత 3 సం|| నుండి మిలిషియా సబ్యులుగా సిపిఐ మావోయిస్టు పార్టీ అగ్రనాయకులు హరిభూషన్, ఆజాద్, లచ్చన్న, శారద, చర్ల శబరి ఏరియా కమిటీ కార్యదర్శి అరుణ, కమాండర్ రజిత, చర్ల మిలిసియా కమాండర్ బాలు ఆదేశాల ప్రకారం పనిచేస్తున్నట్లుగా తెలిపారు. వీరు గతంలో చాలా రకాల నేరాలలో పాల్గొన్నట్టుగా అందులో పెదమిడిసిలెరు దగ్గర పగిడివాగు సమీపంలో రహదారి బ్లాస్టింగ్ చేసినట్టు, కలివేరు సమీపంలో బ్యానర్ కట్టి IED బాంబు పెట్టినట్టు, అదేవిదంగా సిపిఐ మావోయిస్టు పార్టీ ఆదేశాల ప్రకారం ఆదివారం పీఎల్జీఏ వారోత్సవాల నేపథ్యంలో బాగంగా పోలీసు వారి కోసం తాలిపేరు ద్యామ్ వద్ద గల అడవిలో గుంటలు తీసి ఇనుప చువ్వలు అమర్చిన 6 చెక్కలు (Booby troops) ను అమర్చడం కోసం అదేవిదంగా పీఎల్జీఏ వారోత్సవాలకి సంబందించిన కరపత్రాలను వేయడం కోసం వస్తుండగా పోలీసు వారు వారిని పట్టుకొని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి వాటిని స్వాదిన పరుచుకొని అరెస్టు చేసినట్టు చర్ల మండల సిఐ తెలిపారు.