చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన ముత్యాల వెంకటమల్లు అనే వృద్ధుడు మానసిక స్థితి సరిగా లేని దివ్యాంగులైన ఇద్దరు కూతుళ్ళు(కవిత,సరవ్వ) కుమారుడు(నాగరాజు) లతో కలిసి ఊరికి బయట గుడిసె వేసుకుని చాలీచాలని పస్తులతో జీవితం సాగిస్తున్న కుటుంబాన్ని ఈరోజు బిసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి దాసరి ప్రవీణ్ కుమార్ నేత వారు జీవనం సాగిస్తున్న ప్రదేశాన్ని పరిశీలించి ముత్యాల వెంకటమల్లు తో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. నా ముగ్గురు పిల్లల మానసిక స్థితి సరిగా లేదనీ, వారికి సామాజిక భద్రత పెన్షన్ రావడం లేదనీ నాకు వచ్చే పెన్షన్ తో నలుగురం ఓపూట తిని ఓ పూట తినకుండా జీవితం సాగిస్తున్నామని, పదేళ్ళుగా ఇదే గుడిసెలో ఉంటున్న పట్టించుకునే నాథుడే లేడని వాపోయారు
మానసిక స్థితి సరిగాలేని ముగ్గురు పిల్లలకు ఎలాంటి పెన్షన్ రాకున్నా కూడా ఉండడానికి నివాసం కూడా లేకుండా ఊరి బయట గుడిసె వేసుకుని తన పిల్లలతో చాలీచాలని జీవితం గడుపుతున్న ముత్యాల వెంకటమల్లు అనే వృద్ధుడి కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలని దాసరి ప్రవీణ్ కుమార్ నేత కోరారు
ఇదే విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న హుస్నాబాద్ మండల పోతారం(S) గ్రామ యువకులు మెడబోయిన ఆంజనేయులు, మెడబోయిన చంద్రకాంత్ అనే యువకులు స్పందించి పంపించిన వెయ్యి రూపాయల నగదును అందిస్తున్న బిసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి దాసరి ప్రవీణ్ కుమార్ నేత, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు వంగర మల్లేశం, వార్డుసభ్యులు సంపత్ తదితరులు పాల్గొన్నారు