మహబూబ్‌నగర్: ప్రశ్నించిన ప్రభుత్వాన్ని పడగొట్టడమే మోదీ విధానమా? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు. జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిద్దామని పాలమూరు ప్రజలకు పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్ ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ సాధించుకున్నామని, అదే స్ఫూర్తితో జాతీయ రాజకీయాల్లో ముందుకెళ్తామన్నారు. ‘‘నేను మీతో ఉంటా.. మీరు నాతో ఉండాలి. మీరు హామీ ఇస్తే జాతీయ రాజకీయాల్లోకి వెళ్తాం. తెలంగాణ వలే భారత్‌ను కూడా అభివృద్ధి చేసుకుందాం. జాతీయ రాజకీయాల్లో బీఆర్‌ఎస్ చురుకైన పాత్ర పోషించాలి’’ అని కేసీఆర్ అన్నారు.
‘‘సమైక్య పాలకులు మనల్ని నిరాదరణకు గురి చేశారు. వలసలతో వలవలపించేను పాలమూరు అనే పాట ఉండేది. కానీ, ఇప్పుడు పాలమూరు అంటే పచ్చబడ్డ జిల్లా అంటున్నారు. పోరాటాలు చేసిన సాధించుకున్న తెలంగాణలో అద్భుతమైన పథకాలు అమలు చేస్తున్నాం. మహబూబ్‌నగర్ జిల్లా ఇప్పుడు ఐటీ, పారిశ్రామిక హబ్‌గా మారుతోంది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఒక్కటే పూర్తి కావాల్సి ఉంది. ఈ ప్రాజెక్టుకు క