నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణ నివాసికి రాష్ట్ర స్థాయి గుర్తింపు రావడం. తెలంగాణ యంగ్ లీడర్స్ రాష్ట్ర కార్యదర్శిగా పదవి రావడంతో తెలంగాణ మాలమహానాడు నాగర్ కర్నూలు జిల్లా కమిటీ సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ మాలమహానాడు నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు ఏనుపోతుల పర్వతాలు.వర్కింగ్ ప్రెసిడెంట్ చింత సత్తి. జిల్లా ఉపాధ్యక్షులు రావుల శ్రీనివాసులు. మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ మైనార్టీ లపై ఎక్కడ అఘాయిత్యాలు జరిగిన ధైర్యంగా న్యూస్ చేసే వ్యక్తి. నీతి నిజాయితీతో పని చేసిన వ్యక్తికి తెలంగాణ రాష్ట్రం తరఫున తెలంగాణ యంగ్ లీడర్ రాష్ట్ర కార్యవర్గంలోకి ఎన్నికైన సందర్భంగా ప్రతినిత్యం బడుగు బలహీన వర్గాల లో వర్గాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ నాగర్ కర్నూలు జిల్లా ప్రాంతంలో పలు సమస్యలపై సంచలన వార్తలు రాస్తూ తన గొంతు వినిపిస్తున్న యంగ్ డైనమిక్ రిపోర్టర్ షేక్ హబీబ్అహ్మద్ కి తెలంగాణ యంగ్ లీడర్ లో రాష్ట్ర కార్యదర్శి పదవి రావడం చాలా గొప్ప విషయమని భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలకు ఎదగాలని తెలంగాణ మాలమహానాడు తరపున ఘనంగా సన్మానించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యార్థి విభాగం కనక పవన్ కుమార్. జిల్లా కార్యదర్శి భగవత్. శాంపురి సత్యం మంచాల మల్లేష్. శంకర్. సాదిక్. శ్రీధర్ అంజి. తదితరులు పాల్గొన్నారు.