contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రవితేజ కొత్త సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ

‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగులో ఇదే ఆయన తొలి సినిమా. నిన్ననే ఈ సినిమా టైటిల్ ను ఖరారు చేస్తూ, రవితేజ ఫస్టు లుక్ పోస్టర్ ను వదిలారు. ఆ పోస్టర్ లో రవితేజ చాలా స్టైలీష్ గా కనిపించాడు. అయితే ఆయన పాత్ర ఏమిటి? అనే ప్రశ్న అందరిలోను తలెత్తింది. ఈ సినిమాలో రవితేజ సబ్ కలెక్టర్ గా కనిపించనున్నాడట. తాజా ఇంటర్వ్యూలో శరత్ మండవ మాట్లాడుతూ, ఈ విషయాన్ని స్పష్టం చేశాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగు హైదరాబాదులో జరుగుతోంది. రవితేజ తదితరులపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ పాత్రలో రెండు విభిన్నమైన కోణాలు ఉంటాయట .. అవి ఎలా ఉంటాయనేదే ఆసక్తికరం. ఓ యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా నిర్మితమవుతున్నట్టు చెబుతున్నారు. చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ జోడీగా దివ్యాన్ష కౌశిక్ అలరించనుంది. ‘మజిలీ’ సినిమా ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ‘ఖిలాడి’ తరువాత ఈ సినిమా థియేటర్లకు రానుంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :