పెట్రోలు ధర ఆల్ టైమ్ రికార్డుకు చేరుకుంది. అక్టోబర్ 2018లో న్యూఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ. 84ను తాకగా, ఇప్పుడా ధర రూ. 84.20కి చేరి సరికొత్త రికార్డును చేరుకుంది. దాదాపు 29 రోజుల తరువాత బుధవారం మరోసారి ధరలు పెరుగగా, తాజాగా లీటరు పెట్రోల్ పై 23 పైసలు, డీజిల్ పై 26 పైసల మేరకు ధర పెంచుతున్నట్టు ముడి చమురు కంపెనీలు వెల్లడించాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలు పెరిగినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాయి. ఇక తాజా పెరుగుదలతో ముంబైలో పెట్రోలు ధర రూ.90.83కు, డీజిల్ ధర రూ.81.07కు చేరగా, చెన్నైలో పెట్రోలు రూ.86.96కు, డీజిల్ రూ. 79.72కు చేరాయి.