రాజన్న సిరిసిల్ల జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన రుద్రవేని శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి మానకొండూర్ నియోజకవర్గ ఇన్చార్జి గడ్డం నాగరాజు వారి కుటుంబానికి 50 కిలోల బియ్యం అందించి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మ్యాకల మల్లేశం తిప్పరవేనిబాలకిషన్ ,ముత్యం గౌడ్, లక్ష్మణ్, బీజేపీ మండల ప్రచార కార్యదర్శి ఒగ్గర ముత్యం, స్వామి, అజయ్ తదితరులు పాల్గొన్నారు.