నర్సీపట్నం : గబ్బాడ గ్రామానికి సంబంధించిన సర్వే నెం. 141/2లో య. 0.50సెంట్లు భూమిని తియ్యాల దుర్గా శరత్ కుమార్ కొనుగోలు చేయడం జరిగింది. ఆ ల్యాండ్ కి సంబంధించి పాసుబుక్ కోసం జులై 29న. బుధవారం నాడు నర్సీపట్నం ఎన్మార్వో ని తియ్యాల దుర్గా శరత్ కుమార్ మరియు గంపల గౌతమ్ కుమార్ లు కలవడం జరిగింది… ఎమ్మార్వో మీరు కొన్న ల్యాండ్ ఎక్కడ అనేది మా సర్వేర్ నరేష్ కి చూపించండి అని సర్వేయర్ తో ల్యాండ్ దగ్గరికి ఎమ్మార్వో పంపించడం జరిగింది. అదే సమయంలో ప్రక్క ల్యాండ్ వాళ్ళు మరియు మురళి, అర్జున్, రుత్తల పోతు రాజు నాయుడు, రుత్తల చెల్లాయమ్మ, మరియు వారి అనుచరులు కలిసి శరత్ కుమార్ ను గౌతమ్ కుమార్ లను నిర్బంధించి వారిపై దాడి చేసి చంపేస్తామని బెదిరించి బలవంతంగా ఖాళీ కాగితాలపై సంతకాలు పెట్టమని బాధిస్తుంటే ఈ సమాచారాన్ని అందుకున్న ఎస్సై టి. రవికుమార్ మరియు వారి సిబంది రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ మరియు విశాఖ పోలీస్ కమిషనర్ వారి ఆదేశాల ప్రకారం సరైన సమయంలో స్పందించి బాధితులను కాపాడి విచారణ జరిపి నిందితులపై కేసు నమోదు చేయడం జరిగింది.