contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రెచ్చిపోతున్న ఇసుక మాఫియా .. ఫిర్యాదు చేస్తే నీ అంతూ చూస్తాం !

  •  డబుల్ బెడ్ రూమ్ ల పేరిట…. దర్జాగా దోపిడీ
  •  తహసిల్దార్ ఆదేశాలు…. బేఖాతరు
  •  తెల్లవారుజామున మూడు గంటల నుంచి కొడుతున్న…. పట్టించుకునే ముచ్చటే లేదు
  • నిజాలపూర్ వాగులో….అక్రమ ఇసుక రవాణా
  • ఒక్కో టాక్టర్కు….వెయ్యి రూపాయలు వసూల్సా
  • మాన్యుడికి….ఓ బీఆర్ఎస్ మండల “నేత” ఫోన్ కాల్
  • అధికారులకు ఫిర్యాదు చేస్తావా అంటూ….బెదిరింపుల పర్వం
  •  సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్

పాలమూరు జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ల పేరిట…..దర్జాగా ఇసుక దోపిడీ చేస్తున్నరని సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు దిద్ది ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. జిల్లాలోని మూసాపేట మండలం నిజాలపురం గ్రామ శివారులో గల వాగు నుండి బుధవారం 12 డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణం కోసం కేవలం 28 ట్రిప్పుల ట్రాక్టర్ల ఇసుకను కొందరు అనుమతి పొంది, ఇదే అదునుగా ఇసుక అక్రమ రవాణాకు కొందరు తెరలేపారన్నారు. ఇసుకకు అనుమతి తీసుకున్నది 28 ట్రాక్టర్లకు కాగా, బుధవారం తెల్లవారుజామున మూడు గంటల నుండి దాదాపు 20 ట్రాక్టర్లతో 100కు పైగా ట్రిప్పుల ఇసుకను అక్రమంగా తరలించారని ఆయన తెలిపారు. ఒక్కొక్క ట్రాక్టర్కు వెయ్యి రూపాయలు చొప్పున వసూలు చేస్తున్న వైనాన్ని నేనుసైతం స్వచ్ఛంద సంస్థ బయట పెట్టిందన్నారు.

అధికార బిఆర్ఎస్ పార్టీకి చెందిన మండల స్థాయి ఓ ప్రజా ప్రతినిధి స్వయంగా రంగంలోకి దిగి ఈ తథాంగమంతా నడిపిస్తుండడం గమనార్హన్నారు. సదరు ప్రజాప్రతినిది అండదండలతో ఇసుక అక్రమ రవాణాకు తెరలేపిన కొందరు వ్యక్తులు, బుధవారం తెల్లవారుజామున మూడు గంటల నుండి దాదాపు 20 ట్రాక్టర్లతో 100కు పైగా ట్రిప్పులతో ఇసుకను అక్రమ రవాణాలను చేపట్టారని ఆయన పేర్కొన్నారు. కూలీలతో ఇసుకను ట్రాక్టర్లకు నింపాల్సివుండగా, నిబంధనలను తుంగల్లో తొక్కి….. భాజాప్త జెసిబి తో ట్రాక్టర్లకు ఇసుక నింపి, ఒక్కోక్క ట్రాక్టర్లకు వెయ్యి రూపాయలు వసూలు చేశారని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలోని ప్రవీణ్ కుమార్ మూసాపేట తహసిల్దార్ మంజులకు ఫిర్యాదు చేయగా, దింతో తాను కేవలం 28 ట్రాక్టర్లకు మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ల కోసమే అనుమతి ఇచ్చానని…..బుధవారం ఉదయం తెల్లవారుజామున మూడు గంటల నుండి అనుమతి ఇవ్వలేదని ఆమె చెప్పారని ఆయన తెలిపారు. అంతేకాకుండా వీఆర్వోను అక్కడ పెట్టడం జరిగిందని, నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను అక్రమ రవాణా చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. అంతేకాకుండా తమ మండల ఆర్ ఐని పంపి విచారణ జరిపి ఇసుక అక్రమ రవాణా అడ్డుకుంటానని తహసిల్దార్ మంజుల పేర్కొన్నారు.

తహసిల్దార్ ఆదేశాలు బేఖాతరు

ఇదిలా ఉంటే డబుల్ బెడ్ రూమ్ ల పేరిట కేవలం 28 ట్రాక్టర్లకు మాత్రమే అనుమతి పొందిన సదరు వ్యక్తులు, తహసిల్దార్ ఆదేశాలు బేఖాతరు చేస్తూ బుధవారం ఉదయం తెల్లవారుజామున మూడు గంటల నుండి సాయంత్రం నాలుగున్నర వరకు దాదాపు 150 ట్రిప్పుల ట్రాక్టర్ల ఇసుకను అక్రమ రవాణా చేశారు. అంతేకాకుండా నిబంధనల మేరకు బుధవారం ఉదయం 9 గంటల నుంది మధ్యాన్నం 2 గంటల వరకు మాత్రమే అనుమతులు ఉన్నప్పటికీ, సాయంత్రం నాలుగున్నర వరకు దాదాపు 150 ట్రిప్పుల ఇసుకను అక్రమంగా తరలిస్తున్న మూసాపేట తహసీల్దార్, పొలీస్, రెవెన్యూ, మైనింగ్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు పట్టించుకోవడం గమనార్హం.

అధికారులకు ఫిర్యాదు చేస్తావా అంటూ….బెదిరింపుల పర్వం

ఇదిలా ఉంటే సదరు అధికార బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ మండల ప్రజా ప్రతినిధి నిజాలాపూర్ గ్రామానికి చెందిన ఓ సామాన్యుడికి ఫోను చేసి, ఇసుక అక్రమ రవాణా విషయమై మూసాపేట్ తహశీల్దార్, అధికారులకు ఫిర్యాదు చేస్తావా…? అంటూ బెదిరింపుల పర్వానికి దిగడం కోసమెరుపు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :