కరోనా కేసులు పెరిగిపోతున్న వేళ, మార్చి నుంచి రోడ్డెక్కని ఆంధ్రప్రదేశ్ సిటీ బస్సులు, రేపటి నుంచి తిరిగి సేవలను అందించనున్నాయి. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం నగరాల్లో శనివారం నుంచి ఆర్టీసీ సిటీ బస్సులు నడిపేందుకు ప్రభుత్వం అనుమతించింది.బస్సుల్లో భౌతిక దూరం తప్పనిసరని, ప్రయాణికులు దూరదూరంగా ఉండి ప్రయాణించే ఏర్పాట్లు చేశామని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. తొలి దశలో పరిమిత సంఖ్యలోనే బస్సులు నడుస్తాయని, తదుపరి పరిస్థితిని మరోసారి సమీక్షించి, బస్సుల సంఖ్యను మరింతగా పెంచుతామని తెలిపారు.