కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి కి చెందిన పోతుగంటి నరేష్ కిరాణా షాపులో గుట్కాలు నిల్వచేసి ఉన్నాయన్న సమాచారం మేరకు ఆకస్మికంగా తనిఖీ చేసి లక్ష రూపాయల విలువ చేసే నిషేదించబడిన గుట్కాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఆవుల తిరుపతి తెలిపారు ఎస్ఐ మాట్లాడుతూ మండలంలో ఇకపై గుట్కా ప్యాకెట్లు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు