కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం : ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ 320జీ గవర్నర్ మల్టిపుల్ కౌన్సిల్ ఛైర్మన్ గా ఎన్నికైన డా.లయన్ గుర్రం శ్రీనివాస్ రెడ్డి ఎంజెఫ్ జన్మదిన సందర్భంగా ఒక పేద రైతుకు అధ్యక్షుడు కాంతాల కిషన్ రెడ్డి నూతన వస్త్రాలు,లయన్ బూర శ్రీనివాస్ సానీటైజర్,మాస్కులు అందజేశారు.అనంతరం గన్నేరువరం మండలం హన్మజిపల్లె గ్రామానికి చెందిన డిస్టిక్ జీ ఎం టీ, రెండవ జిల్లా గౌర్నర్ ఎన్నిక కాబడిన లయన్ హనుమండ్ల రాజిరెడ్డి ద్వారా నిరుపేద కుటుంబానికి చెందిన తిప్పర్తి ఆగయ్య పెద్ద కుమార్తె రత్నకుమారి కి కుట్టు మిషన్ ను మరియు బద్దం తిరుపతి రెడ్డి వారికి 25 kg ల బియ్యం అందించారు.గన్నేరువరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అందిచడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కాంతాల కిషన్ రెడ్డి,ట్రస్ట్ చైర్మన్ గంప వెంకన్న, జోన్ చైర్పర్సన్ (డి) బూర శ్రీనివాస్, ఎంపికైన అధ్యక్షుడు జీల ఎల్లయ్య, కార్యదర్శి తిప్పారం శ్రీనివాస్, కోశాధికారి తేళ్ల భాస్కర్,బద్దం తిరుపతి రెడ్డి, బూర వెంకటేశ్వర్,లియో క్లబ్ అధ్యక్షుడు గంట గౌతమ్, బొడ్డు సునీల్, బూర రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.