శబరి లోకల్ ఆర్గనైజింగ్ స్క్వాడ్ లో కీలకమైన పోస్టులో ఉన్న మావోయిస్టు కమాండర్, ఏరియా కమిటీ సభ్యురాలు రోజా, అలియాస్ మండకం సన్ని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్ దత్ ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు కార్యకలాపాలపై రోజా విసుగు చెందారని, అందుకే ప్రజా జీవితంలోకి వచ్చేందుకు నిర్ణయించుకున్నారని ఈ సందర్భంగా ఎస్పీ తెలిపారు. ప్రభుత్వం తరఫున ఆమెకు అందాల్సిన అన్ని రకాల ప్రోత్సాహకాలనూ అందిస్తామని చెప్పారు. అందుకు తానే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. గతంలో జరిగిన పలు ఎన్ కౌంటర్లు, విధ్వంసాల్లో పాల్గొన్న కేసులు రోజాపై ఉన్నాయి.