కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో ఉన్న DCMS కొనుగోలు కేంద్రాన్ని రాత్రికిరాత్రి ఎత్తివేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు తమ వడ్లు కొనుగోలు చేయకపోతే నష్టపోతామని అంటున్నారు రైతులు తమ వడ్లను సగం కొనుగోలు చేసి మిగితా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే పూర్తిగా నష్టపోతున్నామని మీడియాతో బాధను చెప్పుకున్నారు విషయం తెలుసుకున్న బిజెపి మానకొండూరు నియోజకవర్గ ఇన్చార్జి గడ్డం నాగరాజు శుక్రవారం సందర్శించి రైతులను ఓదార్చి కొనుగోలు చేసే విధంగా అధికారులతో మాట్లాడదామని పై అధికారులు కలెక్టర్ తో మాట్లాడి కొనుగోలు చేయిస్తామని రైతులకు భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల శాఖ అధ్యక్షుడు నగునూరి శంకర్, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి జాలి శ్రీనివాస్ రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు మునిగంటి సత్తయ్య, ఓబీసీ జిల్లా కార్యవర్గ సభ్యుడు మచ్చ బాలరాజు, రైతులు మహిళలు తదితరులు పాల్గొన్నారు