వాట్సాప్ ను నిలిపేస్తున్న వాట్సాప్ సంస్థ … కానీ డిసెంబర్ 31 తర్వాత కొన్ని స్మార్ట్‌ఫోన్లపై ఈ మెసేజింగ్ యాప్ పనిచేయదు… ఔట్‌డేటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను వినియోగిస్తున్న స్మార్ట్‌ఫోన్లపై ఇక వాట్సప్ పనిచేయదని ఆ సంస్థ స్పష్టం చేసింది. ఇకపై పాత ఓఎస్‌లకు వాట్సప్ సపోర్టు చేయదు. డిసెంబర్ 31 తర్వాత విండోస్ ఫోన్లపై వాట్సాప్ అప్లికేషన్ పనిచేయదని సంస్థ తెలిపింది. దీంతో నోకియా లూమియా డివైస్‌లపై వాట్సాప్ ఇక పనిచేయదని స్పష్టం చేసింది. ఈ ఫోన్లు విండోస్ ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తున్నాయి. అలాగే, ఫిబ్రవరి 2020 నుంచి విండోస్ ఫోన్లపై వాట్సాప్ బంద్ అయ్యాక ఆండ్రాయిడ్ పాత వెర్షన్‌లు అంటే 2.3.7 వెర్షన్లపై కూడా వాట్సాప్ సపోర్ట్ చేయదు. ఒకవేళ అప్పటికీ మన ఫోన్‌లో వాట్సప్ ఉన్నా మెసేజ్‌లు పంపడం, పంపిన మెసేజ్‌లు చూసుకోవడం వంటి జరగనే జరగవు. అంతేకాదు ఐఓఎస్8పై పనిచేస్తున్న ఐఫోన్లలో కూడా వాట్సాప్ పనిచేయదు. ఈ వెర్షన్ ఫోన్లలో కొత్త ఫీచర్లు ఇన్‌స్టాల్ చేసుకోలేము. పాత ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తున్న స్మార్ట్‌ఫోన్లకు వాట్సప్ సదుపాయం కట్ చేయాలన్న నిర్ణయం కఠినమైనదే అయినప్పటికీ తీసుకోక తప్పలేదంటూ యాజమాన్యం చావుకబురు చల్లగా చెప్పింది.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference