విశాఖలో నిర్వహించిన నావికాదళ మిలన్ పరేడ్-2022 కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ విచ్చేశారు. తన అర్ధాంగి వైఎస్ భారతితో కలిసి ఆయన ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా, మిలన్ ఇంటర్నేషనల్ పరేడ్ సందర్భంగా విశాఖ బీచ్ రోడ్డులో భారీ కోలాహలం నెలకొంది. విశాఖ గగనతలంలో యుద్ధ విమానాల విన్యాసాలు, రోడ్డుపై పదాతి దళాల కవాతు, సముద్రంలో నౌకలు అందరినీ అలరించాయి.
కాగా, విశాఖ పర్యటనలో భాగంగా సీఎం జగన్ ఐఎన్ఎస్ విశాఖపట్నం నౌకను జాతికి అంకితం చేయనున్నారు. మిలన్ పరేడ్ కు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి బొత్స సత్యనారాయణ తదితరులు కూడా హాజరయ్యారు. ఈ పరేడ్ కు 42 దేశాల ప్రతినిధులు విచ్చేశారు.